తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..! 1 y ago
AP: వరుస సెలవులు రావడంతో గత కొన్ని రోజులుగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం భారీగా భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కాగా ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 65,487 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 23,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీనితో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.